జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చందన

కల్లూరి చందనకు నియామకపు పత్రం అందిస్తున్న కాముని వనిత
కల్లూరి చందనకు నియామకపు పత్రం అందిస్తున్న కాముని వనిత

నవతెలంగాణ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కల్లూరి చందన నియామకం జరిపి ఉత్తర్వులను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత బుధవారం అందజేశారు. చందన అంగన్వాడీ టీచర్ గా పనిచేసి శాసనసభ ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి అప్పగించింది. చందనను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, వెల్ముల స్వరూప, మడుపు శ్రీదేవి, ఆడెపు చంద్రకళతో పాటు కాంగ్రెస్ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.