చంద్రబాబుకే నా మద్దతు

Chandrababu is my supportజీ20 సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టు : పవన్‌ కల్యాణ్‌
మంగళగిరి: టీడీపీ అధినేత చంద్రబాబుకు తన మద్దతు కొనసాగుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీ20 సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. ” విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు వచ్చి మాకు మద్దతు తెలిపారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు… తిరిగి ఆ వ్యక్తి కోసం నిలబడటం సంస్కారం. అందుకే చంద్రబాబుకు మద్దతు ఉంటుందని చెప్పాను” అని పవన్‌ వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాజకీయాలను మరోస్థాయికి తీసుకెళ్లిందని విమర్శించారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సష్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.ఏపీ రాష్ట్ర ప్రజలు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ”రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయని ఎప్పుడూ అనుకోవద్దు. కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్రపై దాడి చేసేందుకు 2వేల మంది నేరగాళ్లను దించారు. కోనసీమ జిల్లాల్లో 50 మందిని చంపేయాలని పథకం పన్నారు. వైసీపీ మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించే వారిపై హత్యకేసులు నమోదు చేస్తున్నారు. తణకు, భీమవరంలో వారాహియాత్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చిన వాళ్లు సీఎం కాలేరన్నారు. రాత్రి నన్ను పోలీసులు అడ్డుకున్నారు.. అప్పుడు నేనేం చేయాలి. అందుకే నడి రోడ్డుపై కూర్చున్నా. వైసీపీ నేతలు యుద్ధం కోరుకుంటున్నారు. మద్య నిషేధం అన్నారు..
మా నాన్న పోరాట యోధుడు.. నారా లోకేశ్‌
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన తండ్రి ,టీడీపీఅధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన నేపథ్యంలో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏపీ ప్రజలకు లేఖ రాశారు. ”కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో రాష్ట్ర ప్రజలకు లేఖ రాస్తున్నా. తెలుగువారి అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతో శ్రమించారు. లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని నిత్యం తపించేవారు. మానాన్నకు విశ్రాంతి తీసుకోవడం తెలియదు. నాన్న నుంచి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా. అమెరికాలో ఉద్యోగం వదిలిమరీ దేశానికి తిరిగివచ్చా. రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా? మా నాన్న పోరాట యోధుడు.. నేనూ అంతే. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ప్రజలను కోరుతున్నా” అని బాధాతప్త హదయంతో నారా లోకేశ్‌ లేఖ రాశారు.