చంద్రబాబు అరెస్టు దుర్మార్గం..

– వెంటనే విడుదల చేయాలి.. 
– అల్ ఇండియా బంజారా  సెవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక అద్యక్షులు  తరచంద్ నాయక్..
నవతెలంగాణ -డిచ్ పల్లి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు లో బాగంగా అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గ చర్యా అని ఈ అరెస్టు ను తీవ్రంగా ఖండిచవల్సిందెనని, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నట్లు అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక అద్యక్షులు తరచంద్ నాయక్ అన్నారు. శుక్రవారం అయిన నవతెలంగాణ తో మాట్లాడుతూ చంద్రబాబును ఎలాంటి అభియోగం లేకుండా ఎఫ్ఐఆర్ లోపేరు లేకున్నా అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమన్నారు.అరెస్టు వార్త తమలాంటి నాయకులకు చాలా బాధ వేసిందని, చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల జాతీయ నాయకుడని ఇలాంటి నాయకుడిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు.ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయికి చాటిచెప్పిన మహా నాయకుడని తరచంద్ నాయక్ పేర్కొన్నారు.  పేద ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. బడగు బలహీన వర్గాలకు, హరిజన, గిరిజన మైనార్టీ సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు.ప్రపంచనికి తెలుగు రాష్ట్ర పేరును తెలిసే విధంగా చంద్రబాబు పాలనలో చూశారని తరచంద్ నాయక్ వివరించారు.మహిళలకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం చేసిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు.ఇదే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ కళాశాలలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో  కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక, ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు,ఉర్దూ మీడియం పాఠశాల ఏర్పాటు చేసి ఉపాద్యాయుల నియామకం, ఎస్సీ ఎస్టీ లకు అన్ ఎంప్లాయిమెంట్ లో బ్యాక్ లాగ్  ద్వారా ప్రభుత్వ ఉద్యోగలు  భర్తి, చేసిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందని తరచంద్ నాయక్ పేర్కొన్నారు.ఇదే కాకుండా దేశం ఐటి హబ్ ఏర్పాటు చేసి ఎన్నో కంపెనీలను, అనాటి అమెరికా అధ్యక్షుడు,ఇతర దేశాలకు చెందిన వారిని హైదరాబాద్ కు రప్పించి వేలాది ఉద్యోగాలు సృష్టించి నీరుద్యోగులకు అశాకిరణం గా నిలిచారని,నేడు దేశంలోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దూసుకు పోతుందని అనాడు చంద్రబాబు చేసిన కృషి ఫలితమే నన్నారు.అనాడు ప్రధాన మంత్రి అవకాశం వచ్చినా ముందు రాష్ట్రం బాగు గురించి అలోచించరని, రాష్ట్రపతి గా మిస్సైల్ మేన్ గా ఉన్న అబ్దుల్ కలాం ను చేయడంలో కీలక పాత్ర పోషించారని, అలాంటి నాయకుడిని కావాలని స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తు జైలు పాలు చేయడం సబబు కాదన్నారు. అంద్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, యువకులు పార్టీలకు అతీతంగా అందోళనలు చేస్తున్నారని ఇది జగన్మోహన్ ప్రభుత్వ కుట్రపూరితని నిదర్శనంగా నిలుస్తోందని వివరించారు.చంద్రబాబు అరెస్టును రాజకీయా పార్టీలకు అతీతంగా ఖండించాలని,చంద్రబాబు పై అకారణంగా పేట్టిన కేసులను ఉపసంహరించుకోని వేంటనే విడుదల చేయాలని భాధవత్ తారా చంద్ నాయక్ డిమాండ్ చేశారు.