హైదరాబాద్‌ అభివృద్ధిపై ముద్ర చంద్రబాబుదే

– టీడీపీ బస్సుయాత్రను విజయవంతం చెయ్యాలి:అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
గ్రేటర్‌పై చంద్రబాబు వేసిన చేసిన అభివద్ధి ముద్ర ఎప్పటికీ చెదిరిపోదని తెలంగాణ తెలుగుదేశం శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఈ నెల 23 నుంచి నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ బస్సుయాత్ర విజయవంతంపై గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పార్లమెంట్‌ అధ్యక్షులు ముఖ్య నాయకుల తో కాసాని జ్ఞానేశ్వర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం బస్సుయాత్ర జూబ్లీహిల్స్‌ లోని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సలహాలు, సూచనలతో ఆయన చేతుల మీదుగా ఈ బస్సు యాత్రను చేప డుతున్నట్టు ప్రకటించారు. ఈ యాత్రలో చంద్ర బాబు పాల్గొంటారనీ, పార్టీ యంత్రాంగం భారీగా హాజరుకావాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ను అంతర్జాతీయ స్థాయిలో అభివద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టా త్మకమనీ, ఇదే లక్ష్యంతో చేపడుతున్న బస్సు యాత్ర ను విజయవంత మయ్యేలా పార్టీకి చెందిన పార్ల మెంట్‌ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజక వర్గా ల ఇన్‌చార్జీలు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులపై గురుతర బాధ్యత ఉందన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్‌ రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యు లు బంటు వెంకటేశ్వర్లు జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్‌, అజ్మీరా రాజు నాయక్‌, వెంకటేష్‌, ఆరిఫ్‌, జీవిజీ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీనివాస్‌ నాయడు, రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శులు బిక్షపతి, ఎం. సాంబశివ రావు, రవీంద్ర చారి, మల్కాజగిరి పార్లమెంట్‌ అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్‌ గౌడ్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు సాయిబాబా, రాష్ట్ర తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్‌, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్‌ పాల్గొన్నారు.