చేవెళ్ల ఆర్డీవోగా చంద్రకళ

నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలో ఎస్టేట్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.చంద్రకళను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీవోగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొటోకాల్‌ అదనపు డైరెక్టర్‌ డి.ప్రేమ్‌రాజుకు ఎస్టేట్‌ అధికారిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగించారు.