ఈయస్ఐ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉపాద్యక్షురాలిగా చంద్రకళ..

నవతెలంగాణ  – భువనగిరి
ఉమ్మడి నల్గొండ జిల్లా ఈఏస్ఐ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ అధికారుల నూతన కమిటీని శనివారం తెలంగాణ నాన్ గెజిటెడ్ భవనం లో నల్లగొండ టియన్జీఓ అధ్యక్షులు యం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో వుమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు గా యం చంద్రకళ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మహమ్మద్ సాజిద్ హైదర్, కార్యదర్శిగా మర్రి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా డి విష్ణువర్ధన్, టి.సుమతి, కోశాధికారి సి హెచ్ బాలనర్సింహా, సహాయ కార్యదర్శులుగా వి ప్రియాంక, స్వరూపరాణి కార్యవర్గ సభ్యులుగా పి. రమేష్ రెడ్డి, ఎ. నాగరాణి, యమ్. చిన్న మల్లయ్య, జి.యాదగిరిలను ఎన్నుకోబడ్డారు.ఈ కార్యక్రమం లో నల్గొండ కార్యదర్శి కిరణ్ కుమార్, కోశాధికారి జయరావు, రాష్ట కార్యవర్గ సభ్యులు ఎన్ మురళి పాల్గొన్నారు.