తెలంగాణ ముదిరాజ్ న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా భువనగిరికి చెందిన న్యాయవాది పోతాల చంద్రమోహన్ నియమిస్తూ రాష్ట్ర కార్యవర్గం నియామక పత్రాన్ని శనివారం అందజేశారు. అనంతరం ఆయన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముదిరాజులకు సంబంధించిన వివాదాలు కోర్టులో అధికంగా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఆ వివాదాలపై తెలంగాణ ముదిరాజ్ న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు సూచనలతో పాటు నిరుపేద ముదిరాజులకు వారి తరఫున ఉచితంగా కోర్టులో దావా వేసి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామకం చేసిన సంగం రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది అశోక్ ఉపాధ్యక్షులు రెడ్డబోయిన వినోదులకు అభినందనలు తెలిపారు.