రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ పి.వాసు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈనెల 28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాధాకష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిత్రం నుంచి ‘తొరి బొరి..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను భువనచంద్ర రాయగా, అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. కీరవాణి వినసొంపైన బాణీ అందరినీ మెప్పిస్తోంది. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.