నవతెలంగాణ – చండూరు
నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుని ఎన్నికలు లో చండూరు మున్సిపల్ పట్టణానికి చెందిన తేలుకుంట్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి ఇరుకుల్ల రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఎవ్వరు నామినేషన్ వేయనందున ఆయనని ఏకగ్రీవంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి, బలోపేతానికి తనవంతు కృషి చేస్తాని తెలిపారు. ఎన్నికకు సహకరించే వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో దేవరకొండ మునిసిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా పానగంటి మల్లయ్య ఇరుకుల్ల రామకృష్ణ మాజీ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు చందూరు నాంపల్లి మునుగోడు గట్టుప్పల్ మర్రిగూడ మండల వైశ్య సభ్యులు తే లుకుంట్ల జానయ్య సముద్రాల వెంకన్న మంచుకొండ సంజయ్ కరనాటి శ్రీనివాస్, సోమ నర్సింహా, గట్టు రాజశేఖర్, తాడి శెట్టి సంతోష్,సాగర్,తడక మల్ల శ్రీధర్, మిర్యాల శ్రీను,బిక్కుమాళ్ళ విశ్వనాధం, ఆనంద్,నాగరాజు, సురేష్,భూపతయ్య, తదితరులు పాల్గొన్నారు.