చంద్రవంచ ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్విన కాలువ

– న్యాయం చేయాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు: రైతులు
– సర్వే చేయించి న్యాయం చేస్తాం : తహసీల్దార్‌ తారాసింగ్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
తాండూరు మండలం చంద్రవంచ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌-12లో ప్రభుత్వ ఇనాం భూమి రైతులకు బతుకుదెరువు కోసం పంపిణీ చేసింది. ఆ భూమి పక్కనే ఉన్న పట్టాభూమి సర్వే నెంబర్‌-13లో మరో రైతు నిలువెత్తు లోతన కాలువ తీశాడంటూ తహసీల్దార్‌కు రైతు బాలప్ప నరసింహులు, విజరు కుమార్‌, తదితరులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్‌ ఆ ప్రాంతానికి వెళ్లి, కాలువను పరిశీలించారు. సర్వే చేయించి, కాలువ 12 లో ఉంటే పూడిచి వేస్తామనీ, 13 సర్వే నెంబర్‌ పట్టా భూమిలో ఉన్నట్టయితే నిబంధనల ప్రకారం కాలువ తీసుకోవాలని తహసీల్దార్‌ అన్నారు. ఇష్టానుసారంగా రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని తహసీల్దార్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ బాలరాజ్‌, రైతులు బాలప్ప నరసింహులు, విజరు కుమార్‌ తదితరులు ఉన్నారు.