పొట్లపల్లి గీత కార్మిక సంఘం అధ్యక్షునిగా చంద్రయ్య గౌడ్


నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: పొట్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గీత కార్మికుల సంఘం సొసైటీ ఎన్నికల్లో సంఘం అధ్యక్షులుగా మార్క చంద్రయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా రంగు తిరుపతి గౌడ్, డైరెక్టర్లుగా మార్క రాజమౌళి గౌడ్, చెప్పాల మల్లయ్య గౌడ్ ,బత్తిని ఎల్లయ్య గౌడ్ ,రంగు రాజయ్య గౌడ్ ఎన్నికయ్యారు. బండి శ్రీనివాస్ గౌడ్ మార్క రాజేష్ గౌడ్ రంగు సంపత్ గౌడ్ ఎన్నికల అధికారిగా సిహెచ్ గౌతమ్ వ్యవహరించారు .