జిల్లాలోనే చండ్రుగొండలో అత్యధిక వర్షపాతం 60.5 మి.మీ

The highest rainfall in Chandrugonda in the district is 60.5 mm– నియోజక వర్గం వ్యాప్తంగా 387.3 మి.మీ… 
– అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం మద్యలో నిలిచిపోయిన రాకపోకలు….
– నారాయణపురం సమీపంలో కూలిన భారీ వృక్షం…
– రెండు విద్యుత్ పోల్స్ శిధిలం…
– విద్యుత్ అంతరాయం…
– వరద తీవ్రతను పర్యవేక్షించిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వానలతో నియోజక వర్గం వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కు,నియోజక వర్గం లోని మండలాలకు,పలు మండల కేంద్రాలు నుండి పంచాయితీలకు అక్కడక్కడా రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట నుండి వాగొడ్డుగూడెం రహదారిలో వాగు లో వరద పెరగడంతో రహదారి ని తాత్కాలికంగా నిలిపివేసారు.ఈ రహదారిలో సాగే రాకపోకలను ఊట్లపల్లి మీదుగా మళ్ళిస్తూ తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ప్రత్యామ్నాయ మార్గం సూచించారు. నారాయణపురం లో రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షం ఒకటి కూలిపడింది.దీంతో రెండు విద్యుత్ పోల్ లు శిధిలం అయ్యాయి.ఈ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జిల్లాలో బుధవారం కురిసిన వానలతో చండ్రుగొండ మండలం మద్దుకూరు లో 60.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది.నియోజక వర్గం వ్యాప్తంగా 387.3 మి.మీ వర్షపాతం నమోదు అయింది.
మండలం           నమోదు ప్రాంతం          వర్షపాతం
చండ్రుగొండ          మద్దుకూరు                 60.5
అన్నపురెడ్డిపల్లి      పెంట్లం                        55.0
దమ్మపేట            మల్కారం                     51.5
ములకలపల్లి          ములకలపల్లి                49.0
దమ్మపేట             మందలపల్లి                  46.0
దమ్మపేట              నాగుపల్లి                    44.5
అశ్వారావుపేట      అశ్వారావుపేట              41.5
దమ్మపేట             నాయుడుపేట              27.3
దమ్మపేట            అంకంపాలెం                12.0
మొత్తం                                           387.3