చందుపట్ల మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ అనారోగ్యంతో మృతి…

నవతెలంగాణ  – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన ఎలిమినేటి మల్లారెడ్డి అనారోగ్యంతో సోమవారం సాయంత్రం హైదరాబాదులోని చంపాపేట గ్లోబల్ ఆస్పత్రిలో మృతి చెందారు. కాగా ఈయన ప్రస్తుతం చందుపట్ల బ్యాంకు చైర్మన్, వైస్ చైర్మన్ గా కొద్ది రోజులు సేవలందించారు. అతని కుమారుడు అమెరికాలో ఉండటం వలన అంత్యక్రియలు ఈనెల 9 వ (తొమ్మిదవ) తేదీన గౌస్ నగర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక సామాన్య వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన మల్లారెడ్డి  ఉద్యోగరీత్యా వివిధ పదవులు అనుభవించి, అనంతరం రాజకీయపరంగా చందుపట్ల బ్యాంక్ వైస్ చైర్మన్ గా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలువురు గ్రామస్తులు  సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల మాస్ రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ పాక వెంకటేష్ యాదవ్, సాయి రెడ్డి పోశిరెడ్డి, శ్రీ గోపాలకృష్ణ  గొర్రెల మేకల పెంపొందారుల సంఘం అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్, మాజీ ఎంపిటిసి రాశాల మల్లేష్ యాదవ్ లు ఉన్నారు.