చండూరు డివిజన్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి

Chandur Division should be given the post of District Presidentనవతెలంగాణ – చండూరు 
నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్ష పదవి చండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆర్యవైశ్యులకు అవకాశం కల్పిం చాలని గురువారం నల్లగొండలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెం కటేశ్వర్లు, అదనపు కార్యదర్శికి లక్ష్మీశెట్టి శ్రీనివాస్లకు వినతి పత్రాన్ని అం దజేశారు. కొత్తగా ఏర్పడిన చండూరు రెవెన్యూ డివిజన్ కు ఈసారి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు వినతి పత్రంలో కోరారు. వినతిపత్రం ఆందజేసిన వారిలో తేలుకుంట్ల జానయ్య, మంచుకొండ సంజయ్, తేలుకుంట్ల శేఖర్, కర్నాటి శ్రీనివాసులు, తడకమళ్ల శ్రీధర్, మిర్యాల శ్రీనివాస్, గట్టు రాజశేఖర్, తాడిశెట్టి సంతోష్, సోమ నర్సింహ్మ, ఉమాశంకర్ తదితరులు ఉన్నారు.