వ్యాసమహర్షి పురస్కారాలకు చండూరు వాసుల ఎంపిక..

Chandur residents selected for Vyasamaharshi awards..నవతెలంగాణ – చండూరు  
చండూరు పట్టణానికి చెందిన ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులు మద్దోజు వెంకట సుధీర్ బాబు, డాక్టర్ ఇడికుడ సచ్చిదానందలు వ్యాస మహర్షి పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారాల వివరాలను హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు డేగల మహేష్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు రాఘవేంద్ర చారిలు సంయుక్తంగా ప్రకటించారు.వీరిద్దరికీ ఈనెల 21న టి జి వి కళాక్షేత్రం కర్నూలు లో వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని జరిగే జాతీయస్థాయి కార్యక్రమంలో పురస్కారాలను అందజేస్తారు. సుధీర్ బాబు చండూరు ఉన్నత పాఠశాలలో, అంగడిపేట గ్రామానికి చెందిన డాక్టర్ సచ్చిదానంద హైదరాబాదులో తెలుగు సహాయోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యారంగంలో వీరు చేసిన తెలుగు భాషాసేవలకు, జాతీయ వాద, ధార్మిక సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను అందుకోనున్నారు.