మార్పు

మార్పుమార్పైతే గెలిచింది…
కొనసాగాలి ఓటరు
చైతన్యం ఇంకాస్త…

ఇది ఓటరు విజయం…
ప్రజల ప్రత్యామ్నాయం…

ఆధిపత్యానికి…
అహంకారానికి..
చరమగీతం..
ఇది నిఖార్సైన
తెలంగాణ ప్రజానీకం…

లక్షల లైబ్రరీల నిశబ్దమంతా..
పెనుతుఫాను సృష్టించేందుకే…

కరెంటు కోతలే కష్టమైతే
కటిక చీకట్లు.. కొత్త కాదు..

ఇది పోరాటాల తెలంగాణ…
ఇది ఉద్యమాల తెలంగాణ…
నమ్మితే ప్రాణాలర్పిస్తరూ…
వమ్ము జేస్తే తెగనరుకుతరు…

గొర్రెలింకా…
కటికోన్ని నమ్ముతాయనేది
సందేహమే…
దోచుకునేటోన్ని…
బొంద పెడ్తరు
దాచుకునేటోన్ని
దంచికొడ్తరు..

పాలకుడు పగొడైతే…
పక్కోడు పాలకుడైతడు…

ఏదైనా సరే..
ఎదురులేదని…
విర్రవీగుతె…
ఒక్కసారి తిరగపడితే..
కనుమరుగె…

పార్టీ ఏదైనా…
విజయం ఇంకెవరిదైన…
అట్టడుగు వర్గానికీ
ఫలితం అందలేదో…
మళ్ళా…
మీ కథ ఖతం ఖాయమే..!
– సురేష్‌ నూనేటి
9676457297