– జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎండల తీవ్రత నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు పని గంటల్లో మార్పులు చేయాలని జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షులు జె.వెంకటేష్, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నేతృత్వంలో నాయకులు మంగళవారం జీహెచ్ ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని గంటల మార్పు చేయాలని వారు కోరారు.