నవతెలంగాణ – వీర్నపల్లి
హస్తంతోనే మార్పు సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెడతానnపల్లి చంద్రమౌళి తెలిపారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు…ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అరు గ్యారంటీ లను అములు చేసింది. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా వెలిచాల రాజేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లెంకల లక్ష్మన్, జోగుల కాంతయ్య, లెంకల రాజు, పాటి దినకర్, మండే పల్లి రవి, దేశరాజు కుమార్, సామల్ల నర్సయ్య, గంగదరి సంజీవ్, పర్మాల మల్లేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.