రైతు భరోసా సమావేశం స్థలం మార్పు

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ వ్యవసాయ సహకార సంఘం ప్రత్యేక సమావేశం, ఈనెల3 న  బుధవారం ఉదయం 10 గంటలకు సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్  అధ్యక్షతన  సమావేశం నిర్వహిస్తున్నట్లు సహకార సంఘం కార్యదర్శి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి సమావేశ స్థలాన్ని సింగిల్ విండోలో కాకుండా రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో రైతు భరోసా పథకం అమలుపై రైతులు, సహకార సంఘాల సభ్యుల నుంచి అభిప్రాయాల సేకరించుటకు మద్నూర్ రైతు వేదిక నందు హాజరు కాగలరని సంఘం కార్యదర్శి జె బాబురావు కోరారు.