బీపీ షుగర్‌ పేషంట్‌ కు జీవనశైలిలో మార్పులు అత్యవసరం

Changes in lifestyle are imperative for BP diabetes patients– సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్రత్యూష నేరెళ్ల ఉద్ఘాటన
నవ తెలంగాణ – ముషీరాబాద్‌
బీపీ షుగర్‌ పేషంట్‌ కు జీవనశైలిలో మార్పులు అత్య వసరం అని సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్ర త్యూష నేరెళ్ల ఉద్గాటన సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధా న కార్యదర్శి కె. వీరయ్య అధ్యక్షత బాగ్లింగంపల్లి లో అవ గాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ ప్రత్యూష నేరెళ్ళ మాట్లాడుతూ. బీపీ, షుగర్‌ పేషెంట్లకు మందుల వాడకంతోపాటు జీవనశైలి లో కూడా మార్పులు అవసరమని అన్నారు. వ్యాయామం అవసరమని, కానీ వ్యాయామం అంటే ఫోన్‌ మాట్లాడు తూ అలసట లేని మెల్లగా నడిచే నడక కాదని, అలసట వచ్చేలా బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తేనే ఉపయోగమని అన్నారు. ప్రతి పేషంటు తమ ఆహారంలో పీచు పదార్థం తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. లంచ్‌, డిన్నర్‌ లలో తప్పనిసరిగా కూరగాయల సలాడ్‌ లను తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. ఉబకాయం వలన థైరాయిడ్‌ వస్తుందని, థైరాయిడ్‌ ఊబకాయానికి దారితీ స్తుంది అన్నారు. బరువుని నియంత్రించుకోవడం చాలా అవసరమని, అధిక బరువు ఆరోగ్యానికి అనర్థకమని, అధిక బరువు రాకుండా చర్యలు తీసుకో వాలని, జీవనశైలి ని మార్చుకోవాలని అన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రేక్షకు లు అడిగిన అనేక ప్రశ్నలకు డాక్టర్‌ ప్రత్యూష ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. డాక్టర్‌ జయసూర్య మాట్లాడుతూ .మన శరీరంలోని అవయవాలను కత్రిమంగా ఏర్పాటు చేసుకోవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని ఆరోగ్యకరమైన అవయవాలతో కూడిన శరీరం మనకు ఒక వరం అని దానిని కాపాడుకునేందుకు అందరం కషి చేయాలని అన్నారు. సామాజికవేత్త సీ.హెచ్‌. రాజీవ్‌ మా ట్లాడుతూ. సమాజంలోని పౌరులంతా ఆరోగ్యంగా ఉన్న ప్పుడే సమాజం కూడా సౌభాగ్యవంతంగా ఉంటుందని, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్లాన్‌ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ నగర నాయకులు ఎం. శ్రీనివాసరావు, పి. శ్రీనివాసరావు, డి. సైదులు, పి. నాగేష్‌, రాజమౌళి, సుకుమార్‌, మోహన్‌, గోపాల్‌, హస్మిత, సంగీత, %ఖ%.లలిత, శంకరయ్య, రవీంద్రనాథ్‌, రాములు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.