చలిదృష్ట్య పాఠశాల సమయంలో మార్పులు చేయాలి

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లావ్యాప్తంగా రోజురోజుకు చలి తీవ్రత పెరగడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కావున పాఠశాల సమయంలో మార్పులు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి కోరారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్ ఏవో రామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో విపరీతంగా చలి పెరిగిందన్నారు. దీనివల్ల విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసేలా సమయ మార్పుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులుజారిచేయలని కోరారు. గతంలో కూడా ఈ విధంగా చలి తీవ్రత పెరిగినప్పుడు విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ఉదయం 10 గంటలకు సాయంత్రం నాలుగు గంటల వరకు అనుమతించినట్లు గుర్తు చేశారు.కార్యక్రమంలో నాయకులు, సంజీవరెడ్డి ఉన్నారు.