ఆహారపు అలవాట్లను మార్చుకొని గుండెపోటు సమస్యలకు దూరంగా ఉండవచ్చు

– ప్రతి ఒక్కరూ రక్తపోటు పరీక్షలను తప్పక చేసుకోవాలి

– మనోరమ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ అజేంద్ర శ్రీకాంత్

నవతెలంగాణ కంఠేశ్వర్ 

సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటే గుండెపోటు సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని మనోరమ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజేంద్ర శ్రీకాంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మనోరమా హస్పటల్ అధ్వర్యంలో వాక్ ఫర్ హర్ట్ వాక్ విత్ హర్ట్ పేరిట వాకథాన్ నిర్వహించారు. గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి ప్రారంభమైన వాకథాన్ కోర్టు చౌరస్తా మీదుగా పులాంగ్ చౌరస్తా వరకు సాగింది. ఈ సంధర్బంగా మనోరమ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజేంద్ర శ్రీకాంత్ మాట్లాడుతూ..ప్రతి ఒకరు తమ తమ ఆరోగ్యాన్నికి ప్రాధాన్యత ఇస్తూనే, ఆరోగ్యకరమైన జీవనశైలి ని అనుసరించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమని గుర్తు చేశారు. గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మరణాల కారకాలలో ఒకటిగా ఉన్నందున, అవగాహన ఈ సమస్యను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో  తాము నివారణ చికిత్స కన్నా మెరుగైనదనిగా విశ్వసిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాము కొనసాగిస్తున్న కృషి ద్వారా, గుండె వ్యాధులకు దారితీసే అన్ హెల్తీ డైట్స్, శారీరక కార్యకలాపాల లోపం, పొగ తాగడం వంటి ప్రమాదకర కారణాలపై ప్రజలకు తమ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే అలవాట్లను అంగీకరించాలని, నియమిత పరీక్షలు చేయించుకోవాలని, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం గురించి సమాచారాన్ని పొందాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ పీడియాట్రిషన్ డాక్టర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కట్టా నరసింహ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ రెడ్డి, డాక్టర్ హితేష్ షౌలాని తోపాటు మనోరమ హాస్పిటల్ స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ఈ వాకథాన్లో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సిబ్బంది స్థానిక సమాజంలో పాల్గొని ఈ ప్రధానమైన అంశం పై మద్దతు తెలిపారు.