నవతెలంగాణ – పెద్దవంగర
చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ శ్రేణులు మంగళవారం పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అత్యంత బాధాకరమన్నారు. కేసీఆర్ పై అసూయ తో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పథకాల పేరు మార్పు, అక్రమ అరెస్టులు, రాష్ట్ర చిహ్నాల మార్పు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు శ్రీరాం సుధీర్, జ్ఞానేశ్వర చారి, పసులేటి వెంకటరామయ్య, చిలుక బిక్షపతి, మాజీ సర్పంచులు సాయిలు, బాలు నాయక్, హేమాని, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డెబోయిన గంగాధర్, వెంకటరెడ్డి, కూకట్ల వీరన్న, సీతారాం నాయక్, నిమ్మల విజయ, రైతు కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి, మొగలగాని హరీష్, రాసాల సమ్మయ్య, గిరగాని ఐలయ్య, ఎర్రసాని రామ్మూర్తి, అనుదీప్, గిరగాని, రవి, ప్రవీణ్, సోమయ్య, యాకన్న తదితరులు పాల్గొన్నారు.