నవతెలంగాణ రాజంపేట్: మండలంలోని ఆరేపల్లి గ్రామంలోని శ్రీ కైలాస కోటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి అమావాస్య తర్వాత వచ్చే సోమవారం శివుడికి లక్ష పువ్వులతో అర్చన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.