ప్రత్యేకాధికారుల పాలనలో అస్తవ్యస్తం..

– తోటపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ వినియోగం 

– అధికారుల తీరుపై గ్రామస్తుల అసహనం
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు మండల ప్రజల్లో వెల్లవెత్తుతున్నాయి.అయా గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా నియమాకమైన కొందరు అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారని అపోహ ప్రజల్లో నెలకొంది. శుక్రవారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో సంబంధిత అధికారుల అధేశాల్లేకుండా గ్రామ పంచాయతీ నీటి ట్యాంక్ ట్రాక్టరును హరితహరం పేరునా ఓ గుత్తేదారు భవన నిర్మాణ పనులకు పంచాయతీ సిబ్బంది వినియోగించడం వివాదస్పదమైంది. దీంతో అధికారుల తీరుపై పలువురు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల అవసరాలకు పంచాయతీ ట్రాక్టరును సిబ్బంది వినియోగించిన తీరుపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ను వివరణ కొరగా నిబంధనలను ఉల్లంఘించి సిబ్బంది పంచాయతీ ట్రాక్టరును ఇతరుల అవసరాలకు వినియోగించారని తెలిపారు. విచారణ జరిపి పైఅధికారుల అధేశానుసారం చర్యలు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.