స్పెషల్‌ ట్రైన్‌ పేరుతో అధిక చార్జీల వసూలు

– ప్రొఫెసర్‌ కోదండరాంకు ముంబైకర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కరీంనగర్‌-సీఎస్‌ఎంటీల మధ్య స్పెషల్‌ ఫేర్‌ రైలు పేరుతో అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని పలువురు ముంబైకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ముంబై, భీవండి వలస వెళ్లిన తెలంగాణీయులు హైదరాబాద్‌లో కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పిం చారు. స్పెషల్‌ రైలులో వికలాంగుల రాయితీని అనుమతించడం లేదని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరిం చాలని కోరారు. స్పెషల్‌ రైలును రెగ్యులర్‌ రైలుగా మార్చాలనీ, అజంతా ఎక్స్‌ప్రెస్‌ను ముంబై వరకు, నాందేడ్‌ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌, పన్వెల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కరీంనగర్‌ వరకు పొడిగించాలని అభ్యర్థించారు. తమ సమస్యలను సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర చిరునామాతో ఆధార్‌ కార్డులు కలిగి ఉన్న తెలుగు ముంబైకర్లకు తెలం గాణలో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం లేదని తెలిపారు.