హైదరాబాద్ : కిశోర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చారి 111’ మంచి ఫన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని నిర్మాత అతిథిసోనీ వెల్లడించారు. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి ఒకటో తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారం చిత్ర బృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. అతిథి సోనీ మాట్లాడుతూ వెన్నెల కిశోర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ మూడు నెలలు సమయం తీసుకుని అద్భుతంగా పాటరాశానన్నారు. సైమన్ కె కింగ్ మంచి సంగీతాన్ని అందించారన్నారు.