తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం, కోశాధికారి అనసూయ అనిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట విశ్వం, ఉపాధ్యక్షులు ఉదారి చిరంజీవి, కొత్తపెళ్లి సంజయ్, రావుల వేణు, ఇనుగుర్తి శ్రీనివాస్, గోవర్ధన్, నాయకులు కట్ట కృష్ణ, ఉదారి శేషన్న, గాలివెల్లి వెంకటస్వామి, కట్ట కిష్టయ్య పాల్గొన్నారు.