ప్రజా ఉద్యమాల రథసారథి సీపీఐ(ఎం) ఉద్యమాలకు విరివిగా విరాళాలు ఇవ్వండి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  కల్లూరి మల్లేశం
నవతెలంగాణ – భువనగిరి
కష్టజీవులు పేద ప్రజల సమస్యలపై నిరంతరం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాల రథసారథి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుకి ఇంటింటి సీపీఐ(ఎం) ప్రోగ్రాం లో భాగంగా వస్తున్న సందర్భంగా ప్రజలు ఆదరించి విరివిగా విరాళాలు ఇవ్వాలని సీపీఐ(ఎం), జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం గారు ప్రజలను కోరారు. సీపీఐ(ఎం)  మోటా కొండూరు మండల కమిటీ సమావేశం కొమ్మ గాని దశరథ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రజల సమస్యలపై కార్మికుల, కష్టజీవుల రైతన్నల సమస్యలపై నిరంతరం పనిచేస్తూ, ప్రజల మనలను పొందుతున్న సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలను బలపరచాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. మోటకొండూరు మండలంలో అనేక ఉద్యమాలను కార్యక్రమాలను నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) మండలంలోని గ్రామాలకు ఇంటింటికి వస్తున్న నాయకులను కార్యకర్తలను ఆదరించి ఉద్యమాలను బలోపేతం చేసే ఆర్థిక సహకారం అందించవలసిందిగా విరాళాలు అందించి, మద్దతుగా నిలవాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బోలగాని జయరాములు, మండల కమిటీ సభ్యులు కొల్లూరి ఆంజనేయులు, భోగ రమేష్ బైరపాక సర్వయ్య బందెల పోశయ్య, వంగపల్లి సాయిలు, పాల్గొన్నారు.