నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి విజయలక్ష్మి గార్డెన్ యందు 1987.. 88 లో శిక్షణ పొంది, 36 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ పి పుష్పాకర్ రావు, కో కన్వీనర్లు జంగం అశోక్, ఇందిర లు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆసిఫాబాద్ డీఈవో పి అశోక్, జిల్లా డి ఈ ఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ నాగజ్యోతి, కిరణ్ మోహన్ రెడ్డి ,జి మల్లారెడ్డి తదితరులు హాజరవుతున్నట్టు, ఈ ఆత్మీయ సమ్మేళనానికి పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరినారు.