నవతెలంగాణ- తాడ్వాయి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీడీ ప్యాకర్ బట్టి చాటన్ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి 2016 రూపాయలు అమలు చేయాలని.. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్టియు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకొల ఆంజనేయులు Ao కు వినతి పత్రన్ని అందజేశారు. ఈ సందర్బంగా ముద్రకొల ఆంజనేయులు మాట్లాడుతూ.. బీడీ ప్యాకర్స్ బట్టి చట్టన్ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2016 రూపాయల జీవన భృతి పెన్షన్ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలి, బీడీ ప్యాకర్ బట్టి చట్టన్ కార్మికులు మగవారు అనే పేరుతో వారి పేర్లను నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది వీరు లక్షల్లో బీడీ ప్యాకింగ్ రోజు తరచుగా పని చేస్తూనే ఉంటారు, రెక్కలు కష్టాన్ని నమ్ముకొని అనారోగ్యానికి గురి అవుతున్న కూడా వాటిని సైతం లెక్క చేయకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బీడీ పరిశ్రమాలో పనిచేస్తున్నారు వీరికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా 2016 రూపాయల పెన్షన్ జీవన భృతి ఈనెల చివరి వరకు ప్రకటన చేయాలి, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బి ఎల్ టి యు జిల్లా నాయకురాలు గంగామణి. బి ఎల్ టి యు జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ కార్మికులు కృషమూర్తి, బాబు, నర్సింలు, రాజు, స్వామి, బాబు, రాజు, శివాజి, కిషన్, నారాయణ, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.