
భిక్కనూర్ పట్టణంలోని దక్షిణ కాశి శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో బుధవారం భిక్కనూర్ పట్టణానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాస్తు హోమ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఉడిపి పూజారుల చేత చతుర్వేద పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తు హోమ కార్యక్రమాలు 29వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజా ప్రతినిధులు, భక్తులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ఆలయ పూజారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.