
చౌటుప్పల్ పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుప్పల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జర్నలిస్టు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా చౌటుప్పల్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని విలేకరులకు భరోసానిచ్చారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నయో సర్వే చేయించి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెన్నగొని అంజయ్యగౌడ్ అన్నారు. ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుండి కాపాడి ప్రభుత్వ కార్యాలయాలకు, ఎన్నో ఏళ్ల నుంచి వార్త కథనాలను అందిస్తున్న జర్నలిస్టులకు ప్లాట్లు కేటాయించాలని అంజయ్య గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎరసాని సతీష్ యాదవ్,తంబరేణి రవీందర్,కరంటోతు లింగనాయక్,బొమ్మ మల్లేష్,కొండమడుగు శ్రావణ్ కుమార్,మంచికంటి రమేష్ గుప్తా,ఆరుట్ల లింగస్వామి,తోనేశ్వర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.