నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: పి ఆర్ టి యు టి ఎస్ చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ ఆర్డిఓ జగన్నాధ రావు క్యాలెండర్ ను ఆవిష్కరించారు.మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 3 షార్,రేగట్టె రాజిరెడ్డి లు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో కేఎంవి జగన్నాధ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో అధికంగా చదువుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించాలని అన్నారు.మధ్యాహ్న భోజన విషయంలో ఏవైనా అవంతరాలు ఉంటే పాఠశాలల ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు.పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షులు మోటె సత్తయ్య మాట్లాడుతూ పిఆర్టియు సంఘం బోధనలోను ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలోనూ ముందుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు భీమిడి ఉపేందర్,కే.మాధవరెడ్డి,ఎస్.నరసయ్య,నాగమణి, శివ,కుమార్,జి మారయ్య మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ బి.విజయ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ జిల్లా బాధ్యులు రవీందర్ రెడ్డి, వెంకటయ్య,తేజస్విని,వసంత,విశ్వనాథం,వినోద, రమాదేవి,మధు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.