సీహెచ్‌సీ 50 పడకలకు పెంపు

– జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనగామ జిల్లా పాలకుర్తి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచనున్నారు. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్‌గ్రెడేషన్‌ కోసం రూ.17.50 కోట్లను వెచ్చించనున్నారు.