రష్యా నుంచి చౌకగా ఆయిల్‌..

–  అయినా భారత్‌లో తగ్గని చమురు ధరలు
–  రష్యా నుంచి చౌకగా ఆయిల్‌..
న్యూఢిల్లీ : దేశంలో కొన్ని నెలల కిందట పెట్రో ధరలను ఎడాపెడా పెంచిన మోడీ సర్కారు వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టింది. ఆ సమయంలోనూ అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్‌ ధరల పెరుగుదలను సాకుగా చూపెట్టిన మోడీ సర్కారు సామాన్య జనాల నుంచి అందినకాడికి దోచుకున్నది. అయితే, ప్రస్తుతం భారత్‌కు రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడాయిల్‌ లభిస్తున్నది. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ కొనుగోలు చేసిన క్రూడాయిల్‌ ధరతో పోల్చుకుం టే.. రష్యా నుంచి 16 డాలర్లు తక్కువకే వస్తున్నది. అంటే ఒక్క బ్యారెల్‌కు తేడా రూ. 1310 అన్న మాట. గత నెల భారత్‌.. రష్యా నుంచి దాదాపు 39 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకున్నది. ఈ లెక్కన చూసుకుంటే భారత్‌లో పెట్రో ధరలు తగ్గాలి. కాని మోడీ సర్కా రు అలా చేయలేదు. రష్యా నుంచి చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. పాత ధరలను అలాగే కొనసా గిస్తూ ఖజానాను నింపుకుంటున్నది. దీంతో దేశంలో గత పది నెలలుగా పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ విధంగానూ మోడీ సర్కారు పరోక్షంగా వాహనదారులపై భారం మోపుతున్నదని విశ్లేషకులు తెలిపారు.