చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం: చీప్ సూపర్ డెంట్ రాజశేఖర్ 

– నవతెలంగాణ కి స్పందన 
నవతెలంగాణ నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలం  చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని బాన్సువాడ సాగునీటి అధికారి చీప్ సూపర్డెంట్ రాజశేఖర్ తెలిపారు. (నవతెలంగాణ పత్రికలో గత రెండు రోజులుగా సాగునీటి సమస్యలపై వార్తలు ప్రచురితం కావడంతో) ఆదివారం సాయంత్రం బీర్కూర్ మండలం దామరంచ రైతు నగర్, నసురుల్లాబాద్ మండలం మీర్జాపూర్ మైలారం గ్రామాల్లో ఇరిగేషన్ చీఫ్ సూపర్డెంట్ రాజశేఖర్ డిప్యూటీ ఇంజనీర్ జగదీష్ లు పర్యవేక్షిస్తూ రైతులకు భరోసా కల్పించారు. బీర్కూర్ నసురుల్లాబాద్ మండలంలోని తదితర గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని రైతులు ఆందోళన చేపట్టడంతో స్పందించిన సాగునీటి ఉన్నత అధికారి రాజశేఖర్ ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎస్సీ రాజశేఖర్ మాట్లాడుతూ వివిధ మండలాల్లో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందకపోతే స్థానిక మండల సాగునీటి అధికారులకు గాని బాన్సువాడ సాగునీటి కార్యాలయంలో సమాచారం అందించాలని వారు కోరారు. ప్రతి గుంటకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 ఉమ్మడి మండలంలో చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించాలని, సాగునీటి కాలువల్లో అడ్డంకులను తొలగించాలన్నారు.
ఎండాకాలం సాగునీటి కాలువ ల్లో ముళ్లపొదలు పెరగడం, రాళ్లు పడడం సర్వ సాధారణమని తెలిపారు. ముళ్లపదలను రాళ్లను తొలగించామని, పూర్తిస్థాయిలో చివరాయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు వీరి వెంట మండల ఇరిగేషన్ అధికారి అజాం ఖాన్ ఇరిగేషన్ సిబ్బంది మండల పరిధి రైతులు తదితరులు పాల్గొన్నారు.