నవతెలంగాణ – దుబ్బాక
గ్రామాల్లో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంపులతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని… వాటిని సద్వినియోగం చేసుకుంటే అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం దుబ్బాక మండల పరిధిలోని పోతారంలో లోహిత్ సాయి హాస్పిటల్స్ సిద్దిపేట వారిచే ఏర్పాటుచేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ శిబిరాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఆయన వెంట ఆసుపత్రి వైద్యులు భాస్కర్ అమీరి శెట్టి,ఆసుపత్రి మేనేజర్లు తిరుపతి,చంద్రశేఖర్,మల్లారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు సల్కం మల్లేశం యాదవ్,పోతారం మాజీ సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి,పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.