ఆరోగ్యమహిళా కార్యక్రమం తనిఖీ

నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ ప్రియాంక మంగళ వారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రకాల వ్యాధుల పరీక్షలకు వచ్చే మహిళలకు హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, కుర్చీలు, టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో శీతాకాలంలో ప్రజలకు అంటువ్యాధులు, జ్వరాలు వ్యాపించకుండా వైద్యాధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. ప్రతి మంగళవారం 50 రకాల వ్యాధులకు పరీక్షలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎస్‌ఎంఎస్‌ రజియా, డాక్టర్లు స్రవంతి, లింగమూర్తి, ఎంపీడీవో బాణాల శ్రీనివాస్‌, ఎంపీఓ నరేష్‌,ఎంఎల్‌ హెచ్పీలు హరిప్రసాద్‌, ప్రవళిక, అనూష, సిబ్బంది పాల్గొన్నారు.