చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

– చల్మెడకు మద్దతుగా తుల ఉమా ప్రచారం
నవతెలంగాణ- రుద్రంగి : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధి ని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా అన్నారు ఆమె రుద్రంగి మండల కేంద్రంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు చల్మేడ కూతురు నిహారిక తో పాటు ఎంపిపి గంగం స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మీనయ్య కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుల ఉమ మాట్లాడుతూ.ఏ ఇంటికి వెళ్లిన కేసీఆర్ కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే గా చల్మేడ లక్ష్మీ నరసింహారావు ను గెలిపిస్తే ముఖ్యమంత్రి గా కేసీఆర్ గెలిచినట్టేనని అన్నారు. చల్మేడ లక్ష్మీ నరసింహరావు పదవి కోసం డబ్బు కోసం ఎమ్మెల్యే గా పోటీ చేయడం లేదని కేవలం ప్రజా సేవ చేయడానికి నియోజకవర్గన్నీ అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తూ మీ ముందుకు వచ్చారని ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో చల్మేడను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, మంచే రాజేశం, చెప్యాల గణేష్, తలారి నర్సయ్య, పొగుల నర్సయ్య, ఎల్లాల గంగారెడ్డి, అల్లూరి లచ్చిరెడ్డి, అంబటి రాములు, ప్రదీప్, మ్యాదరి గంగధర్, తదితరులు పాల్గొన్నారు.