మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తహసిల్దార్ సత్యనారాయణ శనివారం తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలను విద్యార్థులకు మినుపకారం భోజన వసతులను హాస్టల్లో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని మూత్రశాలలను డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఉండాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని వసతి గృహ వార్డెన్కో సూచించారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ తో పాటు మురుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యేటట్లు ఉన్నత అధికారులకు నివేదిక పంపించినట్లు తాసిల్దార్ తెలిపారు. వసతి గృహంలోని విద్యార్థుల హాజరు పట్టిక , స్టోర్ రూమును పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనాన్ని అందించాలని వసతిగృహ అధికారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రంజిత్ వసతి గుహ వార్డెన్ సాయి కుమార్ ఉన్నారు.