
నవతెలంగాణా – సిద్ధిపేట
గంజాయి, ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి రహిత జిల్లాగా నిర్మించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నార్కటిక్స్ డాగ్స్ తో అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరాణా షాపులలో, బేకరీలలో, టీకొట్లలో, పాన్ డబ్బాలు, అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన, షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, అజయ్ కుమార్, రమేష్, వన్ టౌన్ ఎస్ఐ కొమురయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.