మత్తు పదార్థాలను పసిగట్టే జాగిలంతో తనిఖీలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
మత్తు పదార్థాలను పసిగట్టే ప్రత్యేక శిక్షణ పొందిన కొత్తగూడెం డాగ్ స్క్వాడ్ సిబ్బంది అశ్వారావుపేట పట్టణంలోని గంజాయి విక్రయ అనుమానిత ప్రాంతాలను గురువారం తనిఖీ చేశారు. గంజాయి విక్రయ పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి పోలీస్ జాగిలం తో తనిఖీ చేశారు.అనంతరం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల బ్యాగులను పోలీస్ డాగ్ చేత తనిఖీ చేయించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి మత్తు పదార్థాలు, గంజాయి లభించలేదని డాగ్ స్క్వాడ్ సిబ్బంది తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ కానిస్టేబుల్స్ సంతోష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.