నర్కోటిక్ లో ప్రత్యేక శిక్షణ పొందిన రాంబో డాగ్ స్క్వాడ్ తో మండల కేంద్రంలో గురువారం ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, కిరాణం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఓ కంట కనిపెట్టాలన్నారు. విద్యాసంస్థల్లోనూ నిరంతరం అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. ప్రధానంగా యువత విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని పేర్కొన్నారు.మాదకద్రవ్యాలు గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాన్స్ కార్డును తెప్పించామని, మాదకద్రవ్యాలను అరికట్టడానికి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సై జగదీష్, పోలీసులు సాంబయ్య, డాగ్ స్కీం బృందం తదితరులు పాల్గొన్నారు.