వేములవాడ టౌన్ సి.ఐ వీరప్రసాద్..
నవతెలంగాణ – వేములవాడ
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణ పరిధిలోని పాన్ షాపులు, కిరాణా షాపులలో నిషేధిత గంజాయి మత్తు పదార్థాలు గుర్తించడానికి పోలీస్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో సోమవారం వేములవాడ పట్టణ పరిధిలోని బస్టాండ్, పాన్ షాప్ లు,కిరణ షాప్, మొదలగు ప్రాంతల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందని టౌన్ సి.ఐ వీరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ సి.ఐ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ,అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికి వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పోలీస్ జాగిలాల సహాయంతో కూడా వారిని పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద , పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.