వీఆర్ఏల రెగ్యులరైజ్ పట్ల హర్షం..

– సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కౌశిక్ ఫొటోలకు పాలాభిషేకం
నవతెలంగాణ-వీణవంక
వీఆర్ఏలకుపే స్కేల్ అమలు చేస్తూ వారిని రెగ్యులరైజ్ చేయడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కౌశిక్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ మండల అధ్యక్షుడు దుబాసి ప్రదీప్ మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను గుర్తించి పే స్కేలు అమలు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. తమ కుటుంబాలకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దాసారపు రవీందర్, వోరెం చందర్, తిరుపతి, శ్రీనివాస్, దిలీప్, సుజాత, భానుప్రసన్న, సుధాకర్, వర్ష, వీరస్వామి, ప్రభాకర్, చొక్కయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.