
డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరేష్, మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ, మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం పట్ల గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యం, ప్రకాష్ గౌడ్, బాలయ్య, ప్రవీణ్ గౌడ్, లావణ్య, లతా, సునీత, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.