– ప్రభుత్వ ధరలతో రైతులు ఎరువులు తీసుకువెళ్లాలి: సహకార సంఘం కార్యదర్శి బాబురావు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రైతుల కోసం రసాయన ఎరువులు అందుబాటులో ఉంచేందుకు 40 టన్నుల యూరియా, 20-20-0 15 టన్నులు అలాగే డిఎపి 10 టన్నులు దిగుమతి చేసుకోవడం జరిగిందని మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా అందుబాటులో ఉన్నాయని, ఈ రసాయన ఎరువులు ప్రభుత్వ ధరల ప్రకారమే అమ్మబడుతాయని వ్యవసాయదారులు రసాయన ఎరువులను తీసుకువెళ్లాలని సహకార సంఘం కార్యదర్శి జే బాబురావు నవ తెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. శుక్రవారం నాడు 40 టన్నుల యూరియా దిగుమతి అయినట్లు ఆయన తెలిపారు. రసాయన ఎరువుల ధరలు యూరియా ఒక బ్యాగ్ ధర రూ.266 రూపాయలు ఇక 20-20-0 ఎరువు ధర రూ.1050 రూపాయలు డీఏపీ ధర రూ.1350 రూపాయలు సహకార సంఘం పరిధిలోని వ్యవసాయదారులు ప్రభుత్వ ధరలకు అమ్మే ఎరువులను సహకార సంఘం ద్వారా కొనుగోలు చేసుకుని ప్రభుత్వ ధరలు సద్వినియోగం పంచుకోవాలని సంఘం కార్యదర్శి రైతులను కోరారు.