
నగరంలోని అభ్యాస ద స్కూల్లో స్వర్గీయులైన స్కూల్ కరస్పాండెంట్ చిన్న శ్రీనివాస్ జ్ఞాపకార్థం చెన్నా శ్రీనివాస్ మెమోరియల్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజారాం స్టేడియం నందు నెట్ బాల్ పోటీల్లో జిల్లాలోని 16 పాఠశాలలు పాల్గొన్నాయి అదేవిధంగా అభ్యాసలో చెస్ ,క్యారం, టేబుల్ టెన్నిస్, స్కిప్పింగ్, డాచ్ బాల్, రన్నింగ్ రేస్, ఎలిఫెంట్ వాక్, ఫ్రాగ్ జంప్ ,మ్యూజికల్ చైర్, కోకో, పోటీలు నిర్వహించి ఆదివారం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం. నాగమణి, జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. అభ్యాస యాజమాన్యం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసిస్తూ ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించాలని కోరారు అదేవిధంగా జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అభ్యాస యాజమాన్యం ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన పోటీలకు కృతజ్ఞత తెలియజేశారు, ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ చిన్న అన్నపూర్ణ మాట్లాడుతూ.. చెన్న శ్రీనివాస్ రోలింగ్ షీల్డ్ ను ప్రకటిస్తూ చదువులతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అభ్యాస స్కూల్ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగిస్తామని, అదేవిధంగా పిఈటి నాగరాజును కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అభ్యాస యాజమాన్యం డైరెక్టర్లు శ్రీనివాస్ ఇంకా శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.