– ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
ఆదరించి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మండల పరిధిలోని మాదారం, గడిసింగాపూ ర్ గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రజా సంక్షే మమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొ చ్చారని తెలిపారు. నేడు సంక్షేమ పథకాలు ప్రజాద రణ పొందుతున్నాయన్నారు. ప్రతి గడపకు ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకే 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చిందని కాంగ్రెస్ నమ్మి మోస పోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.